పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..
త్రిపురారం, ఆంధ్రప్రభ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి(Peddevulapalli) గ్రామంలో ఈ రోజు దివంగత మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ విగ్రహాన్ని సీనియర్ మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుండెబోయిన రామ్మూర్తి యాదవ్(heartbroken Rammurthy Yadav)తో తనకున్న స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, ఎంసీ కోటిరెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి(Julakanti Rangareddy), రామ్మూర్తి యాదవ్ తనయులు గుండెబోయిన కోటేష్, నగేష్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


