KTR Twit | గురు కులాల్లో ఆకలి ఆర్తనాదాలు – ఫుడ్ పాయిజన్ మరణాలు
హైదరాబాద్ – పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు అని… ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయని సిఎం రేవంత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు .
నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు అని… నేడు సరైన దిశానిర్దేశం లేక దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారని తెలిపారు. నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు… నేడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారని సెటైర్లు పేల్చారు.
నాడు కడుపునిండా అన్నం తిని-అనుకున్న లక్ష్యాలను సాధిస్తే…నేడు అన్నమో రామచంద్ర అనే రోజులొచ్చాయి…నాడు 41 వేల సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్ష 68 వేల దరఖాస్తులు వస్తే నేడు 51 వేల సీట్లకు గాను 80 వేల దరఖాస్తులే వచ్చాయన్నారు. ఏడాది పాలనలో 50 కి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదని తెలిపారు.
చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా అంత్యక్రియలకు, పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్భంధం ప్రయోగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సర్కారు నిర్లక్ష్యంతెలంగాణ భవిష్యత్తు అయిన భావితరాలకు శాపమన్నారు.