లక్ష 16 వేల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు
- అయిదుగురిపై కేసు నమోదు
ధర్మపురి (ఆంధ్రప్రభ) : ధర్మపురి మండలంలోని నేరెళ్ల గ్రామంలో పేకాట ఆడుతున్న స్థావరంపై శుక్రవారం రాత్రి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జగిత్యాల సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు ధర్మపురి పోలీసుల సంయుక్తంగా దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి 1,16,000 రూపాయల నగదు 5 సెల్ ఫోన్ లు స్వాధీనపరుచుకున్నారు.ఆడిన వారిపై కేసు నమోదు చేసినట్లుగా, జూదం ఆడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని దాడులు కొనసాగుతాయని సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

