శ్రీశైలం ఆదాయం రూ.4.08 కోట్లు

శ్రీశైలం ఆదాయం రూ.4.08 కోట్లు

శ్రీశైలం, ఆంధ్రప్రభ : శ్రీశైలం మల్లన్న హుండీల్లో భక్తులు రూ.4.08 కోట్లు సమర్పించారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం లో గురువారం హుండీలను లెక్కించగా మొత్తం రూ. 4,08, 69,958 ల నగదు లెక్క తేలింది. ఈమేరకు దేవస్థానం కార్యనిర్వాణా అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు.

హుండీల్లో రూ. 3,97,30,582 లు, అన్నప్రసాద వితరణ హుండీల్లో రూ. 11,39,376 లు మొత్తం వెరసి రూ 4,08,69,958 లు లభించాయన్నారు. గత నెల 18 వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు గత 35 రోజులలో హుండీల్లో.. జూన్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు అన్నప్రసాద వితరణ హుండీల్లో ఈ ఆదాయం లభించినట్టు ఈవో స్పష్టం చేశారు. ఈ హుండీలో 639 గ్రాముల 500 మిల్లీగ్రాముల బంగారం, 3 కేజీల 480 గ్రాముల వెండి లభించాయన్నారు.

363 యుఎస్ఏ డాలర్లు, యు.ఏ.ఈ దిలార్లు 30, 1 కువైట్ దినార్1, సౌది రియాల్స్ 5, కత్తార్ రియాల్స్1,సింగపూర్ డాలర్లు 62, కెనడియన్ డాలర్లు40, ఇంగ్లాడ్ పౌండ్స్20, మలేషియా రింగిట్స్27, ఓమన్ బైసా 200, కొరియా ఓన్స్ 620 మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టినట్టు ఈవో తెలిపారు.

Leave a Reply