సాగుచేసినవాడు పరార్..
జైనూర్, ఆంధ్రప్రభ : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందస్తు సమాచారం ప్రకారంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జండాగూడ గ్రామ శివారులోని పంట చేనులో పత్తి కంది పంటల మధ్యన అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పట్టుకుని స్వాధీనం చేసుకున్నట్లు జైనూర్ ఎస్సై రవికుమార్ తెలిపారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కలను పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో పంచనామ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. సాగు చేసిన నిందితుడు ఫరారులో ఉన్నాడని ఆయన పట్టుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.