ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హెచ్చరిక
(ఒంగోలు రూరల్ , ఆంధ్రప్రభ) : తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు (Damacharla Janardhan Rao) గురువారం ఒంగోలు కార్పొరేషన్ అధికారులు, టిడిపి పార్టీ నాయకులతో జూమ్ వీడియో కాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు కార్పొరేషన్ అధికారులు, పార్టీ నాయకులుకు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురుస్తాయన్న తుఫాన్ వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు ఉండాలి, ప్రజలు విద్యుత్ స్తంభాలకు విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలన్నారు.
ప్రమాదాలు చోటు చేసుకోకుండా పిల్లలను, పశువులు సంరక్షణ చేయాలి, రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ తీగల వద్ద ప్రమాదాలకు దూరంగా ఉండాలన్నారు. అదేవిధంగా ఒంగోలు (Ongolu) నగరంలో పోతురాజు కాలవ వెంబటి నివసించే ప్రజలు అప్రమత్తంగా వుండాలి అన్ని, మీకు సమస్య వచ్చిన పార్టీ కార్యాలయంలో ప్రతినిధులు, మున్సిపల్ అధికారులను సంప్రదించాలి అన్ని పార్టీ నాయుకులకి తెలియజేసారు. గతంలో జరిగిన చేదు అనుభవాల రీత్యా ముందుగాన్నే పోతురాజు కాలువ పూడిక తియ్యడం వల్ల చాలా సమస్య తగ్గింది అన్ని గుర్తుచేశారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
మున్సిపల్ కార్యాలయాలలో ఎమర్జెన్సీ సెంటర్ (Emergency Center) ను ఏర్పాటు చేశారని ఏదైనా సహాయం కావాలంటే మున్సిపల్ కార్యాలయాలలో సిబ్బందికి తెలియజేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుండి ఏ సమస్య ఉన్న నేరుగా తన దృష్టికి కూడా తీసుకురావాలి అన్ని జనార్దన్ వివరించారు. ఈ సమావేశంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, మేయర్ సుజాత, క్లస్టర్ కన్వినర్లు, మండల పార్టీ అధ్యక్షులు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.