ప్రకృతి ప్రేమికుడు కొండాజీ బ్రహ్మయ్యకు స‌న్మానం..

ప్రకృతి ప్రేమికుడు కొండాజీ బ్రహ్మయ్యకు స‌న్మానం..

లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : ప్రకృతి ప్రేమికుడు విశ్రాంత డీటీఓ కొండాజీ బ్రహ్మయ్య(Kondaji Brahmayya) అని ప్రముఖ వైద్యుడు తుమ్మల దేవరావు అన్నారు. ఈ రోజు పట్టణంలోని విశ్రాంతి డీటీఓ బ్రహ్మయ్యను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఏ రకమైన ప్రచారాలకి, ప్రశంసలకి తావు లేకుండా రాబోయే తరాల కోసం ఎన్నో రకాల మొక్కలు నాటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

ఒక ఎకరం స్థలంలో అందమైన ఉద్యానవనాన్ని(gardener) సృష్టించి, ప్రతి మొక్కను నాటిన ఘనత బ్రాహ్మయ్య కు దక్కిందన్నారు. వేలాదిమొక్కల్ని సంరక్షిస్తూ, ఎన్నో పక్షుల కిలకిలరావాల మధ్య ఆశ్రమ వాసిగా జీవిస్తున్నారన్నారు. రాతి నిర్మాణపద్దతిలో మట్టితో నిర్మించిన ప్రాంతంలో యోగసాధన, అధ్యాత్మిక చింతన, పుస్తకపఠనం(books), జీవవైవిధ్యాన్ని ఆస్వాదిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply