33 కోట్ల దేవతలను పూజించిన పుణ్యఫలం

33 కోట్ల దేవతలను పూజించిన పుణ్యఫలం

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని పసుపుల గ్రామ శివారులో గల అనాకులం గోకులం గోశాలలో ఈ రోజు మారుతి మెగాస్టార్ యజమానులు గోశాల నిర్వాహకుడు కొడంగల రాధాకృష్ణ భట్(Kodangala Radhakrishna Bhat), కొడంగల రఘు ప్రసన్న భట్, కొడంగల మోహన్ భట్ ఆధ్వర్యంలో గోపూజ వేడుకలు, సూక్త హోమం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ గోపూజ వేడుకలకు పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం నేరడగం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ పంచమసిద్ద లింగ మహాస్వామి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి(Chittem Rammohan Reddy), మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య(Kondaiah) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు .

ఈ సందర్భంగా పీఠాధిపతి మాట్లాడుతూ.. సకల దేవతలకు నిలయం గోమాత అని అన్నారు. గోమాతను పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. గోమాత పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. అదేవిధంగా గోదారిత వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని పీఠాధిపతి పిలుపునిచ్చారు. సనాతన హిందూ ధర్మంలో తల్లిదండ్రుల తర్వాత గోమాత(Gomatha)కు అత్యంత ప్రాధాన్యం ఉందని ప్రతి ఒక్కరూ గో సంరక్షణ కోసం కంకణ బదులు కావాలని ఈ సందర్భంగా పీఠాధిపతి పంచమసిద్ధులుగా మహాస్వామి పిలుపునిచ్చారు .

150 ఆవులను ఒకే చోట సంరక్షణ గొప్ప విషయమని గోశాల నిర్వాహకులు కొడంగల సోదరులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply