భూమిపూజ చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, అక్టోబర్ 22 (ఆంధ్రప్రభ) : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ.88లక్షలతో నూతనంగా నిర్మించే ఉట్నూర్ డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయ భవన నిర్మాణానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భవన నిర్మాణంలో నాణ్యత లోపించకుండా భవన పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్ (Doota Rajeshwar), కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ లింగంపల్లి చంద్రయ్య జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బానోత్ జైవంత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ ఏక్బాల్, ఉట్నూర్ ఎస్ టి ఓ రాఘవేందర్, ఏటీవో జి ప్రవీణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ తరుణ్ జాదవ్, ఎస్ టి ఓ కార్యాలయ ఉద్యోగులు రాకేష్ సుజాత అమరవాణి ప్రవీణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త పెల్లి మహేందర్, బిరుదుల లాజర్, ఉద్యోగులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply