నిర్మాణాలను పరిశీలన
కోనరావుపేట, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను జిల్లా హౌసింగ్ అధికారి ముజాఫురోద్దీన్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla) జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో 25 ఇల్లు మంజూరు కాగా 22 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి.
వాటిని నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిర్మాణాలకు సంబంధించి బిల్లులు వచ్చాయా లేదా అనేది తెలుసుకున్నారు. ఇందిరమ్మ పథకం(Indiramma scheme) పేదలకు వరం లాంటిదని అన్నారు.