ఐపీఎస్ ఎట్లా అయ్యావు ?
- ప్రొటోకాల్ తెలుసా?
- చదువుందేమో గాని తెలివి లేదు
- ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పై జేసీ ఆగ్రహం
అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : నువ్వు ఐపీఎస్ ఎట్లా అయ్యావు.. చదువుందేమో గాని తెలివి లేదు అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిJC Prabhakar Reddy) తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఏఎస్పీ రోహిత్ చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నీకు ప్రొటోకాల్ తెలుసా? జిల్లా కలెక్టర్‌ను మిలటరీ ట్రస్టులో వెళ్లి కలుస్తావా అని ప్రశ్నించారు.
ఈరోజు అన్న పోలీస్ డ్రెస్ లో జనానికి కనిపించావా అంటూ మండిపడ్డారు. తాడిపత్రిలో నువ్వు వచ్చిన తర్వాత శాంతిభద్రతలు కుదరటం పడలేదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతోనే శాంతిభద్రతలు ఏర్పడ్డాయని ఆయన అన్నారు. తనదైన శైలిలో ఏఎస్పీ పై విరుచుకుపడ్డారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఆయన హాజరై ప్రసంగించారు. ఏఎస్పీ రోహిత్ చౌదరి(ASP Rohit Chaudhary) ప్రెస్ మీట్ పెట్టి తాడిపత్రిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెబుతాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాళ్ల దాడులు జరిగితే నువ్వు బయటికి రాలేన పరిస్థితి కానిస్టేబుల్ సీఐలు లేకుండా నువ్వు బయటికి రాలేదు. నువ్వు పోలీస్ అధికారవా లేక ఇంకా ఏమైనానా అంటూ మండిపడ్డారు. తాడిపత్రిలో ఘర్షణలు జరిగితే ఇంట్లో దాక్కుంటావా అంటూ ఆయన ప్రశ్నించారు. రోహిత్ కుమార్(Rohit Kumar) చౌదరి తీరుపై పదివేల మంది సంతకాలతో ప్రభుత్వానికి పంపిస్తానని తెలిపారు..