తాటిచెట్టుపై నుంచి పడి రామస్వామి మృతి
ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామంలో కళ్లెం రామస్వామి తాటి చెట్టుపై నుంచి కిందపడి మృతి చెందగా, ఆదివారం ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుడిగె పెంటయ్య గౌడ్, సిల్వరు బాలరాజు గౌడ్, మహేందర్ గౌడ్, కళ్లెం పాండు, నరేష్ తదితరులున్నారు.
