ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారం అవ‌స‌రం..

ప్ర‌తి ఒక్క‌రి స‌హ‌కారం అవ‌స‌రం..

బాసర, ఆంధ్ర ప్రభ : ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఈ రోజు హరిత సంబరాలు నిర్వహించారు. యూనివర్సిటీ ఉపకులపతిగా ప్రొఫెసర్ ఏ. గోవర్ధన్(Professor A. Govardhan) పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయిన సందర్భంగా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి విద్యార్థులు, ఉద్యోగులు హరిత సంబరాలు నిర్వహించారు.

ఉపకులపతి గోవర్ధన్ చేత మొక్కలు నాటించారు. ఉపకులపతి మాట్లాడుతూ.. ఈ విశ్వవిద్యాలయం మన అందరిదని, అందరూ సమిష్టిగా దీని అభివృద్ధికై పాటుపడాలని, మనిషి దీక్ష దక్షతలతో పని చేస్తే ఎంతటి కష్టతరమైన పని అయినా సాధించవచ్చు అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని అందుకు విశ్వవిద్యాలయంలోని ప్రతి ఒక్కరి సహకారం కూడా అవసరమని అన్నారు.

విద్యార్థులు, ఉద్యోగుల సహకారం ఉంటే మన తెలంగాణలో ఉన్న బాసర త్రిబుల్ ఐటీ(Basara Triple IT) దేశంలో మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఓఎస్ డి ప్రో.ఇ.మురళి దర్శన్(OSD Prof. E. Murali Darshan), డీన్స్ డాక్టర్. విటల్, డాక్టర్ మహేష్, పిడి శ్యాంబాబు, డాక్టర్ గజ్జల శ్రీనివాస్, డాక్టర్ రాకేష్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply