సోలార్ పథకం పై అవగాహన

సోలార్ పథకం పై అవగాహన
నకరికల్లు, ఆంధ్రప్రభ : విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మండల కేంద్రంలో పీఎం సూర్యఘర్ సోలార్(PM Suryagarh Solar) పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నకరికల్లు(Nakarikallu) గ్రామంలోనీ కరెంటు ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సూర్యుడే మన శక్తి.. సౌరశక్తి మన భవిష్యత్తు అని అధికారులు పేర్కొన్నారు.
సౌర శక్తిని వినియోగించుకోవడం వలన విద్యుత్(Electricity) ఖర్చులను తగ్గించుకోవచ్చని విద్యుత్ శాఖ సిబ్బంది తెలిపారు. అదేవిధంగా వినియోదారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. విద్యుత్ సిబ్బంది వినియోగదారులు ర్యాలీలో పాల్గొన్నారు.
