ఠాణా ఆవ‌ర‌ణ‌లో మ‌హిళ ఆత్మహత్యాయత్నం

ఠాణా ఆవ‌ర‌ణ‌లో మ‌హిళ ఆత్మహత్యాయత్నం

పోలీసుల వ‌ద్దే చేయికోసుకున్న మహిళ
కుమారుడిపై కేసు పెట్టొద్ద‌ని విజ్ఞ‌ప్తి
ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ, ఒక‌రికి తీవ్రగాయాలు


శ్రీ సత్య సాయి బ్యూరో, అక్టోబర్ 18 (ఆంధ్రప్రభ): శ్రీ సత్య సాయి జిల్లా కదిరి (Kadiri) పట్టణ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం సంఘటన శనివారం పట్టణంలో కలకలం రేపింది. కదిరి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో ఒక విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.

సదరు విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గాయపరిచిన మరో విద్యార్థి పై కేసు (Case) నమోదు చేశారు. తన కొడుకు పై కేసు నమోదు చేయవద్దంటూ ఆ విద్యార్థి తల్లి ముబీనా పోలీస్ స్టేషన్ లోనే తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గాయపడిన మహిళను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళకు చెయ్యికి తీవ్రంగా గాయ మైంది . తన కొడుకుపై కేసు నమోదు చేయకూడదని విద్యార్థి మైనర్ అని పోలీసులకు ప్రాథేయపడినా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని బాధిత మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాగా బాధిత మహిళలకు ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపారు.

Leave a Reply