విద్యారంగంలో రిజర్వేషన్ కల్పించాలి..

విద్యారంగంలో రిజర్వేషన్ కల్పించాలి..
ఉట్నూర్, ఆంధ్రప్రభ : బీసీ రిజర్వేషన్ సాధించే విధంగా బీసీ సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 18న తలపెట్టిన తెలంగాణ బంద్ ను సక్సెస్ చేయాలని ఉట్నూర్ బీసీ సంఘాల కన్వీనర్ శ్రీపతి లింగాగౌడ్(Sripathy Lingagoud) నాయకులు కోరారు. ఈ రోజు ప్రెస్ భవన్‌లో బీసీ రిజర్వేషన్ పోరాట సమితి కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్(BC Reservation) పోరాట సమితి కన్వీనర్ శ్రీపతి లింగాగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అధిక సంఖ్యలో ఉన్నా బీసీలపైన అణచివేత జరుగుతుందని.. చట్ట సభల్లో బీసీలకు స్థానం కల్పించి విద్యారంగంలో రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నదని అన్నారు.
తెలంగాణ బీసీ రిజర్వేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈనెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్(state bandh) సందర్భంగా ఉట్నూర్ డివిజన్ మార్కెట్ బంద్ చేయాలని.. తలపెట్టిన రాష్ట్ర బంద్ సందర్భంగా రాబోవు మన తరువాతి తరం బీసీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేలా అందరూ అన్ని విద్యా సంస్థలు, అన్ని రకాల వ్యాపార వేత్తలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున సంపూర్ణ మద్దతు తెలుపుతూ మార్కెట్ బంద్(market bandh)ను విజయవంతం చేసే దిశగా సహకరించాలని కోరారు. ఉట్నూర్ మండల గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బీసీ బిడ్డలు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నాయకులు ధరణి రాజేష్, కేంద్రే రమేష్, కందుకూరి రమేష్, కట్టా లక్ష్మణాచారి, బింగి వెంకటేష్(Bingi Venkatesh), సత్యం, పొన్నం జగన్, గంట విజయ్, సల్గారే రవీందర్, రమేష్, పొన్నం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
