రికార్డుల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్..

రికార్డుల‌ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్..

జ‌గిత్యాల‌, ఆంధ్ర‌ప్రభ : జగిత్యాల జిల్లా గొల్లపల్లి(Gollapalli) మండలం తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్(Satya Prasad) ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మీసేవ సర్టిఫికెట్ల(Meeseva certificates)ను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలనీ, సర్టిఫికెట్లు ప్రజలకు అందించవలసిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్(Madhusudhan), గొల్లపల్లి మండల తహసిల్దార్ ఎండి మాజీద్ తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply