విజయం సాధించేలా కృషి చేయాలి..

విజయం సాధించేలా కృషి చేయాలి..
- బోరబండ 344, 354 వార్డులకు ఇంచార్జి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియామకం
యాదాద్రి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో బోరబండ డివిజన్‌లోని 344, 354 వార్డుల ఎన్నికల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, బీఆర్ఎస్ పార్టీ(BRS Party) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(Kalvakuntla Taraka Rama Rao) ఈ రోజు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రాంచంద్రారెడ్డిని ఇంచార్జిగా నియమించారు.
ఈ నియామకంతో బోరబండ ప్రాంతంలో పార్టీ బలపరచడం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల ప్రచారం సమర్థవంతంగా జరగేలా పర్యవేక్షణ, బాధ్యతలు కల్లూరి రాంచంద్రారెడ్డి(Kalluri Ramchandra Reddy) నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు.

