గగన వీధిలో మిలమిల

  • రోజు రోజుకూ పెరుగుడే
  • పసిడి ప్రియులకు నిరాశ
  • ఆభరణాలు పలుచన
  • దిమ్మెల దొంతరలు
  • రూ.1.30 లక్షకు చేరువలో మేలిమి బంగారం

ఆంధ్రప్రభ, వెబ్ బిజినెస్ డెస్క్ : ఇటు దీపావళి పండుగ.. అటు పెళ్లిళ్ల సీజన్ ఆరంభం కావటంతో.. బంగారం మార్కెట్ ఖుషీ ఖుషీగా ఉంది. దీపావళి సంబరంలో కొనుగోళ్లు మందగించినా.. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం గగనమే. ఇప్పటికే బంగారం ధర రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రారంభంలో దేవుడి పాటగా గ్రాముకు ఒక రూపాయి ధర తగ్గించి.. ఈ రోజు బంగారం ధర తగ్గుతోందని ఊరించే బులియన్ మార్కెట్(Bullion market).. జనం పెరిగే కొద్దీ ధర పెంచేస్తోంది.

మరో నాలుగ రోజుల్లో దీపావళి పండక్కి టపాసులు కాల్చే బదులు బంగారం కొనుక్కుందామనే ఆలోచన ఇటీవల జనంలో పెరిగిపోయింది. ఇక దేశీయ, అంతర్జాతీయ రాజకీయ స్థితి గతుల్లో అమెరికా డాలర్(US dollar) ధర తగ్గుముఖం పట్టటంతో… బంగారం ధర విపరీతంగా పెరిగిపోతోంది.. ఇక ఆదివారం నుంచే పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. డిసెంబర్(December) నెలాఖరు వరకూ కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా సుమారు 48 లక్షల జంటలు పెళ్లి చేసుకోబోతున్నాయి. ఈ సీజన్ లో మొత్తం వ్యాపారం టర్నోవరు రూ.6లక్షల కోట్లు పైనే అని బిజినెస్ పెద్దలు అంచనా వేస్తున్నారు.

అక్టోబర్ 14, 2025న భారతదేశంలో బంగారం ధరల(gold prices) వేగంతో దూసుకు పోతున్నాయి. పది గ్రాముల బంగారం ధర రూ.1,30,000 లకు అతి చేరువులోనే ఉంది. మంగళవారం సాయంత్రం అందిన సమాచారం మేరకు 24 క్యారట్ ల 10 గ్రాముల బంగారం ధర 1,28,680లకు చేరింది. 1‌‌0 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,17,950లకు, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 96,510 కు చేరింది. సోమవారం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర 32లు పెరిగితే.. మంగళవారం గ్రాము ధర 328 లకు ఎగబాకింది.

అంటే.. బంగారం ధర పది రెట్లు దూసుకు పోయింది. 10 గ్రాముల 24 క్యారట్ల(carats) బంగారం ధర 320 పెరిగి1,25,400కి చేరింది. 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర 300 పెరిగి 1,14,950 లకి చేరింది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర 240 పెరిగి 94,050 లకు చేరింది. సోమవారం వందల వ్యత్యాసంలో పెరిగిన ధర మంగళవారం వేలలో దాటిపోయింది.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 3200లు, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 3000లు, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 2,460లు పెరిగింది. ఇక ఇదే రీతిలో ధర దూసుకు పోతే అక్టోబర్ 18 నాటికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,40,000లు దాటిపోవటం ఖాయమే అని బంగారం ప్రేమికుల గుండెల్లో అలజడి ప్రారంభమైంది.

దీపావళి(Diwali), ధన తెరస్ పండుగలకు ముందుగా భారతదేశంలో బంగారం కొనుగోలు శుభకర సూచికగా పరిగణిస్తారు. దీంతో రిటైల్ బిజినెస్ లో డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. దేశంలోని ప్రధాన నగరాలు హైదరాబాద్, ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరుల్లో ఈ డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది. గతంతో పోల్చితే బంగారం ఆభరణాల కొనుగోళ్లు తగ్గాయి.

ఎక్కువ మంది బంగారం ప్రియులు లైట్ వెయిట్, ప్లేటెడ్ గోల్డ్ పై ఆసక్తి చూపుతున్నారు. దసరా పండుగ సీజన్ లో గత ఏడాది 24 టన్నుల బంగారం టర్నోవరు నమోదు కాగ.. ఈ ఏడాది అక్టోబర్ 2న 18 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగింది. అంటే ఏడాదిలోనే ఆభరణాల బంగారం కొనుగోలు 25% తగ్గింది.

రోజు రోజుకూ బంగారం ధర పెరగటంతోనే ఆభరటనాల అమ్మకాల విలువ మాత్రం 30- నుంచి 35% పెరిగింది. కేవలం దసరా రోజున బంగారం ఆభరణాల టర్నోవరు 24,000- కోట్లు నుంచి 25,000 కోట్లుగా బిజినెస్(Business) వర్గాలు అంచనా వేశాయి. అంటే.. ఆభరణాల కొనుగోలు శక్తి సడలిపోతోంది కానీ.. విలువ పెరుగుతోంది.. ఎందుకంటే..

అమెరికా – చైనా(US – China) మధ్య టారిఫ్ టెన్షన్లు, మధ్యప్రాచ్యంలో ఘర్షణలు వంటి అంతర్జాతీయ అనిశ్చితులతో.. బంగారం ‘సేఫ్ హెవెన్’ స్థిరాస్తిగా మారిపోయింది. గత వారంలో బంగారం ధరలు $4,000కు పైగా చేరింది. – అమెరికా డాలర్ బలహీనపడటంతో బంగారం మరింత ఆకర్షణీయంగా మారింది.

అక్టోబర్, డిసెంబర్‌లో ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్‌ల అవకాశాలు (96% ..87%) ఈ బుల్లీష్ ట్రెండ్‌ను మరింత బలపరిచాయి. మరో వైపు చైనా, భారత దేశం సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లకే పెద్ద పీట వేస్తున్నాయి. 2025లో చైనా 22.7 టన్నుల బంగారం కొనుగోలు చేసింది, భారత రిజర్వు బ్యాంకు(Reserve Bank of India) కూడా 770 టన్నులు కొనుగోలు చేసింది. ఈ స్థితిలోనే గ్లోబల్ డిమాండ్‌ పెరిగింది.

నగరం 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ 18 క్యారెట్స్
హైదరాబాద్ రూ.1,28,680లు రూ.1,17,950 లు రూ.96,510లు
వరంగల్ రూ.1,28,680లు రూ.1,17,950 లు రూ.96,510లు
విజయవాడ రూ.1,28,680లు రూ.1,17,950 లు రూ.96,510లు
గుంటూరు రూ.1,28,680లు రూ.1,17,950 లు రూ.96,510లు
విశాఖపట్నం రూ.1,28,680లు రూ.1,17,950 లు రూ.96,510లు
చెన్నై రూ.1,29,000లు రూ.1,18,250లు రూ.97,700లు
కోల్కత్త రూ.1,28,680లు రూ.1,17,950 లు రూ.96,510లు
ముంబై రూ.1,28,680లు రూ.1,17,950 లు రూ.96,510లు
ఢిల్లీ రూ.1,28,830లు రూ.1,18,100 లు రూ.96,660లు
బెంగళూరు రూ.1,28,680లు రూ.1,17,950 లు రూ.96,510లు
కేరళ రూ.1,28,680లు రూ.1,17,950 లు రూ.96,510లు
అహ్మదబాద్ రూ.1,28,730లు రూ.1,18,000లు రూ.96,560లు
వడోదర రూ.1,28,730లు రూ.1,18,000లు రూ.96,560లు

Leave a Reply