ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : తనను చంపేస్తారేమో అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్(Anirudh) అన్నారు. సొంత తమ్ముడిని చంపిన చరిత్ర ఉన్నవారు, ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపొచ్చని పరోక్షంగా ఆరోపించారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని చేర్చుకోబోమని స్పష్టం చేశారు.

మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్(Erra Shekhar) తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌(Congress)ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన ఎర్రశేఖర్.. తిరిగి పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పూర్తిగా ఖండించారు.

ఈ సందర్భంగా ఫ్యాక్షన్ రాజకీయాల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు(factional politics) లేవు. కానీ, సర్పంచ్ పదవి కోసం సొంత తమ్ముడిని హత్య చేసిన చరిత్ర ఉన్నవారు ఉన్నారు. రేపు ఎమ్మెల్యే పదవి కోసం నన్ను కూడా చంపొచ్చు’ అంటూ ఎర్ర శేఖర్‌ను ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలాంటి వారి కోసం నేను ‘జెడ్ కేటగిరి’ సెక్యూరిటీ(Z category’ security) అడగాలా? అని ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని ప్రయత్నం చేసిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడానికి ఉమ్మడి మహబూబ్‌నగర్(Mahbubnagar) జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరూ ఒప్పుకునే పరిస్థితి లేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారికి గేటు వద్దకు వెళ్లినా కనీసం అపాయింట్‌మెంట్(Appointment) కూడా దొరకదని, కావాలనే ఇలాంటి లీకులు ఇస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిని తిరిగి చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్(PCC Chief) స్పష్టతతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply