కాళేశ్వ‌రం బ్యాక్ వాటర్‌తో న‌ష్ట‌పోయిన పంట‌లు

కాళేశ్వ‌రం బ్యాక్ వాటర్‌తో న‌ష్ట‌పోయిన పంట‌లు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌ : కాళేశ్వ‌రం ప్రాజెక్టు బ్యాక్ వాటర్(Project Backwater)తో పంటలు ముంపుకు గురై తన జీవనాధారం కోల్పోవడంతో ఓ రైతు బతుకుపై ఆశలు తెంచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని మహంకాళీవాడ(Mahankaliwada)కు చెందిన గడల మొండి (59) అనే రైతు ఈ రోజు పాలవాగు వద్ద క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న చెన్నూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పంచానామా నిర్వ‌హించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కొన్నేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా పొలాలు తరచూ ముంపుకు గురై పంటలు నష్టపోవడం(loss)తో మొండి జీవనాధారం పూర్తిగా కోల్పోయాడని గ్రామ‌స్థులు తెలిపారు. పంట దిగుబడి చేతికొచ్చే పరిస్థితి లేక అప్పుల భారం పెరిగిపోయి, భవిష్యత్తు అంధకారంగా మారడంతో తీవ్ర మానసిక వేదన గురైనట్టు తెలిపారు.

ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ.. వర్ష వర్షాలకు తోడు కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపుతో తమ పంటలు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల నష్టం(loss of crops) ఓ వైపు.. పరిహారం గురించి ఇంతవరకు రాకపోవడంతో తమ పరిస్థితి అగమ్యకు వచ్చి రంగా మారిందన్నారు. కాళేశ్వ‌రం ముంపు బాధిత రైతులకు తక్షణ ఆర్థిక సహాయం, పునరావాస చర్యలు చేపట్టి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply