అట్లూరి దంపతుల బహూకరణ

అట్లూరి దంపతుల బహూకరణ
గార్ల (మహబూబ బాద్ జిల్లా), ఆంధ్రప్రభ : కోరుకున్నోళ్లకు కొంగు బంగారు తండ్రిగా వాసికెక్కిన గార్ల శ్రీ వేట వెంకటేశ్వర స్వామి(Lord Venkateswara Swamy of Garla)కి ఏపీ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట శివారు ముక్త్యాల అలకనంద రివర్ ప్రింట్ సంస్థ అధినేత అట్లూరి వీర రాఘవ రాయ చౌదరి, – గౌతమి దంపతులు ఆదివారం రజత ఆభరణాన్ని బహుకరించారు.
తొలుత మర్రి గూడెం సమీపంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 132 గ్రాముల వెండి ఆభరణాన్ని(silver ornament) (బంగారు పూత పూసిన కాసుల పేరు) ఆలయ పూజారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు(officials అందించారు.

