పోషణ్ మా ఉన్నతమైన కార్యక్రమం
- రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రోఖయా బేగం
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌తో పాటు 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ ను 2025 సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షేక్ రోఖయా బేగం (Sheikh Rokhaya Begum) పేర్కొన్నారు. స్థానిక చిత్తూరు పట్టణంలోని కొంగారెడ్డిపల్లి నందు గవర్నమెంట్ ఐటి సమీపంలో, సిడిపిఓ కార్యాలయంలో పోషణ్ మాహ్‌ను 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ D.వెంకటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా సభ్యురాలు మాట్లాడుతూ… ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నపిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులను లక్ష్యంగా చేసుకుని, ఈ కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో మంచి పౌష్టికాహారాన్ని (Nutritious food) పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, పాలు ఇచ్చే తల్లులు, మహిళలు పూర్తి స్థాయిలో పోషకాలు అందే ఆహరం తీసుకోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టి రేపటి రాబోయే రోజుల్లో బావిభారత పౌరులు అవుతారని పేర్కొన్నారు.

అనంతరం పీడీ వెంకటేశ్వరి మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లాలో అన్నీ చోట్ల చక్కగా పోషణ మాహ్ (Poshan Maah) కార్యక్రమం ద్వారా చక్కటి అవగాహన అందుతుందని, కాబోయే తల్లులు మంచి పోషకాహారం తీసుకుంటూ అనీమియా బారిన పడకుండా ఆహ్లాదకరమైన పరిస్థితులు కల్పించుకోవాలని చెప్పారు. పోషణ్ మాహ్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు శ్రీ మంతం, చంటి బిడ్డలకు అన్న ప్రాసన, పోషకాహర ప్రదర్శన వంటి కార్యక్రమాల్లో అతిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుగుణ కుమారి, డిసిపిఓ సుబ్రహ్మణ్యం, ఐసీడీఎస్ సూపర్ వైజర్స్.. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, గర్భిణీలు, తదితరులు పాల్గొన్నారు.
