అందరివాడు అంబేద్కర్ : ఎంపీ తెన్నేటి

బాపట్ల టౌన్, అక్టోబర్ 9 (ఆంధ్రప్రభ) : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడని లోక్ సభ ప్యానల్ స్పీకర్ బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ అన్నారు. చిత్తూరు జిల్లాలో బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి (B.R. Ambedkar statue) వైయస్సార్సీపీ నాయకుడు నిప్పు పెట్టిన ఘటనపై బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు పిలుపుమేరకు గురువారం కూటమి నాయకులు ర్యాలీగా క్యాంపు కార్యాలయం నుండి పెదనందిపాడు ఫ్లైఓవర్ వద్దగల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు.

నిరసన కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషించిన ఎంపీ తెన్నేటి (MP Tenneti) మాట్లాడుతూ… భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుర్మార్గపు చర్యను ఖండిస్తున్నామన్నారు. అంబేద్కర్ అందరివాడని అన్ని వర్గాలు దేవుడిలా కొలుస్తారని ఎంపీ చెప్పారు. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు నారాయణస్వామి (Narayana Swamy) తన అనుచరుడుతో మతవిద్వేషాలను రెచ్చగొట్టేందుకు శాంతి భద్రతలకు వైఫల్యం కలిగించేందుకు కుట్రపూరిత రాజకీయాలు వైసిపి చేస్తుందని చెప్పారు.

వైసిపి సర్పంచ్ గోవిందయ్య హస్తం ఉందని పోలీసుల దర్యాప్తులో బహిర్గతమైందన్నారు. దాన్ని టిడిపి నాయకులపై నెట్టి వారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని నారాయణస్వామి పన్నిన కుట్ర బయటపడిందన్నారు. అంబేద్కర్ షెడ్యూల్ కులాల ప్రజల దేవుడని ఈ ఘటనకు పాల్పడిన గోవిందయ్యను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కమిషన్ (SC Commission) కు లేఖ రాసిన వైసిపి ఎంపీకి నిజాయితీ ఉంటే ఈ ఘటన వెనుక ఉన్న వారిని కూడా శిక్షించాలని కోరాలని ఎంపీ తెన్నేటి సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల అధ్యక్షులు దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply