మృతుడికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నివాళులు

  • హోం గార్డు కుటుంబానికి పరామర్శ


రామన్నపేట, ఆంధ్రప్రభ : ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డు ఉపేంద్ర చారి కుటుంబాన్ని ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని న‌కిరేక‌ల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య (Chirumarthi Lingaiah) కోరారు. ఈ రోజు ప్ర‌మాదానికి గురై దుర్మ‌ణం పాలైన ఉపేంద్ర కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. రామ‌న్న‌పే ద‌వాఖానాకు వెళ్లి మృత‌దేహానికి నివాళులు అర్పించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ…. మృతుని కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు తదితరులు ఉన్నారు.

Leave a Reply