ప్రియుడు ఆత్మహత్య
- ప్రియురాలి బతుకు అంధకార బంధూరం
- ఎమ్మిగనూరులో విషాదాంత
ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు(Emmiganur) మండలం, గువ్వలదొడ్డిలో ఒక ప్రేమకథ దారి తప్పింది. . ప్రేమ, మోహం, ఒత్తిడి, ఆత్మహత్య ఈ నాలుగు అంశాలూ ఒక పచ్చని కుటుంబాన్ని ఛిద్రం చేశాయి. ప్రేమించుకున్నారు. పెద్దలు వినలేదు. ఇతరులతో పెళ్లి జరిగింది. కానీ పాత ప్రేమను వీడలేదు. కడకు రెండు జీవితాలు ప్రేమ ఘాతానికి కుమిలి పోయాయి. కుమిలి పోక తప్పలేదు.
ఈ కఠోర విషాదాంత కథలో.. ప్రేమికుడు ఆత్మహత్య చేసుకుంటే.. ప్రేయసి సభ్య సమాజంలో ఈసడింపులను మూటగట్టుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి గ్రామానికి చెందిన ధనుంజయ గౌడ్(Dhanunjaya Goud)(27) ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. వివాహానికి ముందు అదే గ్రామానికి చెందిన శశికళ అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. కానీ పెద్దలు ఈ బంధాన్నిఅంగీకరించలేదు. దాంతో ఇద్దరూ ఇతరులను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగినా వీరి ప్రేమ బంధం మాత్రం తెగలేదు. ఇది వివాహేతర బంధం కొనసాగింది. ఒక దశలో వీరిద్దరూ ఊరు వదిలి వెళ్లిపోయారు.
భార్య వదిలి వెళ్లినా.
ఈ వ్యవహారం కారణంగా ధనుంజయ(Dhanunjaya) భార్యతో విభేదాలు తలెత్తాయి. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ధనుంజయ, శశికళల మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. శశికళ కూడా తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలి ఎమ్మిగనూరుకు వెళ్లిపోయింది.
అక్కడ ప్రియురాలు, ఇక్కడ ప్రియుడు
ఎమ్మిగనూరులో ధనుంజయ ఒక మెడికల్ షాప్(Medical Shop) నడుపుతున్నాడు. అతను ప్రియురాలిని ఒక లేడీస్ హాస్టల్లో చేర్చి అక్కడి నుంచి తరచుగా కలుసుకునేవాడు. శశికళ హాస్టల్ జీవితానికి విసిగిపోయి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకు వెళ్లమని ధనుంజయ పై ఒత్తిడి పెంచింది. ప్రియుడు మాత్రం మాటలతో కాలయాపన చేస్తుండటంతో, ఆదివారం(Sunday) ఆమె ఆవేశానికి లోనై తన మెడకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని సెల్ఫీ పంపింది.
దిగ్బ్రాంతితో విషం తాగిన ప్రియుడు
సెల్ఫీ చూసిన ధనుంజయ తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆమె చనిపోతే తనపై కేసు(Case) వస్తుంది, నా జీవితం నాశనం అవుతుంది అనే భయంతో గ్రామంలోని ఓ పొలంలోకి వెళ్లి పురుగుమందు తాగాడు. పొలం పక్కన ఉన్న రైతులు అతడిని అపస్మారక స్థితిలో గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)కి తరలించారు, కానీ చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు.
శశికళ కారణం : అమ్మానాన్నఆరోపణ
తమ కుమారుడి మరణానికి శశికళే(Sasikale) కారణమని ధనుంజయ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరచుగా మానసికంగా వేధించడంతోనే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు ఆరోపించారు. పోలీసులు(Police) కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ప్రేమ ఒకప్పుడు తీపి కలలా ఉంటుంది, కానీ దానిని మోహంగా మార్చుకుంటే జీవితం క్షణాల్లో బూడిదవుతుంది అని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు.