విజయవాడ అభివృద్ధిలో కీలకం

ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి
జైన్ టెంపుల్ వీధిలో అన్నదానం ప్రారంభించిన ఎంపీ

ఆంధ్రప్రభ, భవానీపురం (విజయవాడ) : విజయవాడ (Vijayawada) నగర అభివృద్ధిలో జైనులు (Jains) ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్ (Parliament Keshineni Shivnath) పేర్కొన్నారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలోని వన్ టౌన్ ప్రాంతం (తమినవారి వీధి) జైన్ టెంపుల్ వీధిలో ఆదివారం ఘనంగా శ్రీ సంభవ నాథ్ జైన్ శ్వేతాంబర్ మూర్తి పూజక్ సంఘం ఆధ్వర్యంలో మెగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. 25 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రవివార్ వారాంత అన్నదాన మహోత్సవానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంపీ స్వయంగా భక్తులకు ఆహారం వడ్డించారు.

ఈ సందర్భంగా ఎంపీ.. జైన సమాజ ఆధ్యాత్మిక సంప్రదాయాలు, సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ప్రశంసలు కురిపించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ విజయవాడ నగర అభివృద్ధి, వాణిజ్య రంగం, సామాజిక సేవల్లో జైనుల పాత్ర అపూర్వం. సమాజ సేవా కార్యక్రమాల్లో జైన సమాజం చూపిస్తున్న తపన ప్రశంసనీయమైనది. ఈ మెగా అన్నదానం కార్యక్రమం 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక విశేషం. ఇది కేవలం జైన సమాజానికే కాకుండా విజయవాడ మొత్తం నగరానికి గర్వకారణం అని తెలిపారు.

ప్రజా సేవలో ఎప్పుడూ ముందుండే జైన సమాజం ధార్మిక, దాతృత్వ కార్యక్రమాలకు తాను అండగా ఉంటానని ఎంపీ కేశినేని శివనాథ్ భరోసా ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ కు ప్రత్యేక విమాన సర్వీసును త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు జయంతి లాల్, అశోక్ కుమార్, కార్యదర్శి పన్నాలాల్, సహాయ కార్యదర్శి భోగిలాల్, కోశాధికారి దుంగర్ మన్, స‌భ్యులు చందు, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు సోలంకి రాజు, 38వ డివిజ‌న్ అధ్యక్షుడు అమ‌ర‌ముర‌ళీ, బుద్దు (శివాల‌యం) ఆల‌యం చైర్మ‌న్ పిల్లా సుద‌ర్శ‌న్, క్ల‌స్ట‌ర్ ఇన్చార్జ్ ధ‌నేకుల సుబ్బారావు, క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి ఆల‌య డైరెక్ట‌ర్ సుఖాసి కిరణ్ పాల్గొన్నారు. స్థానిక జైనులు, భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మెగా అన్నదానం విజయవంతం చేశారు.

Leave a Reply