మంత్రి శ్రీహరితో అజారుద్దీన్ భేటీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : భారత క్రికెట్ మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్(Mohammad Azharuddin), రాష్ట్ర పశుసంవర్థక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ శ్రీహరి(Dr. Srihari)ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్‌లోని మంత్రి క్వార్టర్స్(Quarters)లో మంత్రి వాకిటి శ్రీహరి, అజారుద్దీన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు వివిధ అంశాలపై చర్చించారు.
అజారుద్దీన్‌ను మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారిరువురు వివిధ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి(Gavinolla Balakrishna Reddy), మక్తల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జి. రవికుమార్(G. Ravikumar) తదితరులు ఉన్నారు.