అక్రమ నిర్మాణాల కూల్చివేత
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad)లోని కొండాపూర్ (Kondapur)లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా (Hydra) ఫోకస్ పెట్టింది. ఆర్టీఏ కార్యాలయం (RTA Office) సమీపంలోని భిక్షపతి నగర్లో ఉన్న 36 ఎకరాల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో హైడ్రా సిబ్బంది తొలగించారు. కూల్చివేతల సమయంలో భారీ పోలీసు బందోబస్తు (police security) ఏర్పాటు చేశారు.
సర్వే నంబర్ 59లోని 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు. హైకోర్టు (High Court) తీర్పు మేరకు హైడ్రా ఆక్రమణల తొలగింపును చేపట్టింది. తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించింది. చుట్టూ కంచె వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూముల విలువ రూ.3,600 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు 60 ఏళ్లుగా ఈ భూములు తమ అధీనంలోనే ఉన్నాయని రైతులు చెబుతున్నారు.