బాసర తీరం భక్తుల సందడి

బాసర తీరం భక్తుల సందడి
బాసర, ఆంధ్రప్రభ : 11 రోజులపాటు పూజలందుకున్న దుర్గామాతల నిమజ్జనం బాసర (Basara) పుణ్యక్షేత్రం గోదావరి నదితీరాన ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ రోజు గోదావరి (Godavari) నది బ్రిడ్జిపై దుర్గామాతల వాహనాలు బారులు తీరాయి. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ దుర్గామాతల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

నిజామాబాద్ (Nizamabad) జిల్లా నలుమూలల నుండి ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలల్లో దుర్గామాత ప్రతిమలను ఊరేగింపుగా తీసుకు వస్తున్నారు. వాహనం ముందు భక్తి గీతాలు ఆలపిస్తూ కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ భక్తులు సందడి చేస్తున్నారు. గోదావరి నది రెండవ ఘాట్ వద్ద మండపాల నిర్వాహకులు భక్తులు దుర్గామాత (Durga Mata) లకు ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో దుర్గామాతలను నిమజ్జనం చేశారు.

