శివధర్ రెడ్డిని కలిసిన టీపీసీసీ నేత ఉప్పల
హైదరాబాద్, వెబ్ డెస్క్ : తెలంగాణ నూతన డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy)ని తన కార్యాలయంలో TPCC ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ( Uppala Srinivas Gupta) మర్యాద పూర్వకంగా కలిసి దసరా పండుగ శుభకాంక్షలు తెలియజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… డీజీపీ (DGP) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శివదర్ రెడ్డికి శుభకాంక్షలు తెలిపారు. వారి సారధ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ సజావుగా సాగాలని ఆయన అన్నారు.

