హై వోల్టేజీ గురూ ..

రేణిగంటలో  అగంతకుడు హల్​ చల్​

ఘటన స్థలిలో పోలీసుల బతిమిలాట 

రేణిగుంట , ఆంధ్రప్రభ): గుర్తు తెలియని వ్యక్తి హై వోల్టేజ్ టవర్ ఎక్కిన ఘటన సోమవారం గురవరాజు పల్లి లో  చోటుచేసుకుంది. రేణిగుంట మండలంలోని గురవరాజు పల్లి వద్ద ఉన్న హై వోల్టేజ్ టవర్ ను గుర్తులేని వ్యక్తి ఎక్కాడు.  టవర్ మీదా ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో గుర్తించారు. సమాచారాన్ని రేణిగుంట పోలీసులకు అందజేయడంతో ఘటన స్థలికి  డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర, ఎస్ఐ నాగరాజు తమ సిబ్బందితో  హుటాహుటిన చేరుకునీ ఫైర్ ఇంజన్ పిలిపించారు. ఎలక్ట్రికల్ అధికారులతో   హై వోల్టేజ్ టవర్ లో కరెంట్ సరఫరాను నిలిపివేసారు. కరెంట్ ట వర్ మీద ఉన్న వ్యక్తినీ కిందకు దించేందుకు  పోలీసులు నచ్చ చెబుతున్నారు.

Leave a Reply