మిషన్లు, పేలుడు పదార్థాల తయారీ పట్టివేత..

చర్ల, ఆంధ్రప్రభ : భద్రతా దళాలను తుది ముట్టించాలనే లక్ష్యంతో సొంతంగా ఆయుధ సామాగ్రి ని తయారు చేస్తున్న మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌ఘడ్ లోని సుక్మా జిల్లా మెట్టగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోయిమెంట – ఎరాపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టు ఆయుధ‌ కర్మాగారాన్ని భద్రతా బలగాలు స్వాధీన పరుచుకున్నాయి. డీఆర్‌జీ, 203 కోబ్రా బలగాలు కోయిమెంట – ఎరాపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు తయారు చేస్తున్న ఆయుధ‌ కర్మాగారం కార్ఖానాను భద్రతా బలగాలు గుర్తించాయి.

స్వాధీన‌ప‌రుచుకున్న డంప్ ఇదే!
భద్రతా బలగాలు స్వాధీన పరుచుకున్న వాటిలో వర్టికల్ మిల్లింగ్ మిషన్, బీజీఎల్ లాంచర్లు, బీజీఎల్‌ షెల్స్, బీజీఎల్‌ హెడ్స్, హ్యాండ్ గ్రైండర్ మిషన్, చెక్క ఐఫిల్ బట్, బర్మర్ ట్రిగ్గర్ మిషన్, బర్మర్ ట్రిగ్గర్ మిషన్ పిస్టల్ గ్రిప్ తో సహా, సోలార్ బ్యాటరీలు, బోర్ వెల్ డ్రిల్లింగ్ బిట్, గ్యాస్ కట్టర్ హెడ్స్, డైరెక్షనల్ ఐఈడి పైపులు, మెటల్ మోల్డింగ్ పరికరాలు, స్టీల్ వాటర్ కుండలు, అల్యూమినియం కుండ, ఐరన్ కట్టర్ వీల్స్, ట్యాపింగ్ రాడ్, ఐరన్ స్టాండ్, బీజీఎల్ కు ఉపయోగించే స్టీల్ పైప్ సామగ్రి, పెద్ద సంఖ్యలో ఐరన్ స్ర్కాప్ లు ఉన్నాయి..

Leave a Reply