స్థానిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ (Telangana) లో ఏ క్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల (Local Body Elections) కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు ఉన్న‌తాధికారుల‌తో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. బ్యాలెట్‌ పద్దతిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన‌ట్లు తెలుస్తోంది.

ఈ మేర‌కు ప్ర‌భుత్వానికి తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. ఈనెల 30లోపు షెడ్యూల్‌ విడుదల చేయాలని ఎస్ఈసీ ని ప్ర‌భుత్వం కోరింది. ఇప్ప‌టికే రిజ‌ర్వేష‌న్ల దాదాపు ఖ‌రారు చేస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి చేరిన‌ట్లు తెలిసింది. మొద‌ట ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ స‌భ్యులు, ఎంపీపీ, జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ ఎన్నిక‌లు జ‌రుగుతాయి. త‌ర్వాత పంచాయ‌త్ సర్పంచ్ ఎన్నిక‌లు జ‌రుగనున్నాయ‌ని స‌మాచారం.

Leave a Reply