రేపు చెన్నైకి సీఎం రేవంత్ రెడ్డి !!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఆహ్వానం మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నై పర్యటనకు సిద్ధమయ్యారు.

గురువారం మధ్యాహ్నం ఆయన చెన్నై చేరుకోనున్నారు. అక్కడ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో తమిళనాడు ప్రభుత్వం “ముప్పెరుం కల్వి” అనే విద్యా రంగానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ వేడుకలో సీఎం స్టాలిన్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరవుతారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని, బుధవారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. అనంతరం ఆయన చెన్నై పర్యటనకు వెళ్ళనున్నారు.

Leave a Reply