మహిళలకు బంగారు నాణేల లక్కీ డిప్
- హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో
- మహా బతుకమ్మసంబరాలు
మంచిర్యాల సిటీ , ఆంధ్రప్రభ : హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మహా బతుకమ్మ(Maha Batukamma) సంబరాలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు చుంచు రాజు కిరణ్(Chunchu Raju Kiran), ప్రధాన కార్యదర్శి రవీందర్, ఉపాధ్యక్షుడు దబ్బేట తిరుపతి(Dabbeta Tirupati) తెలిపారు. ఈనెల 24న జిల్లా పరిషత్ బాలుర పాఠశాల మైదానంలో బతుకమ్మఆటపాట ఉంటుందని, మహిళలకు ప్రోత్సాహంగా లక్కీ డ్రా(Lucky Draw) ద్వారా బంగారు నాణేలు, ప్రోత్సాహక బహుమతులు(Prizes) ఉంటాయని తెలిపారు.
ఆసక్తి గల మహిళలు(Women) తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. బతుకమ్మ సంస్కృతి(Culture)ని చాటేందుకు సంబరాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్నిజయప్రదం(Jayapradham) చేయాలని కోరారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ నేటి తరాలకు వాటి ప్రాముఖ్యతను తెలిపేందుకు హిందూ ఉత్సవ సమితి(Hindu Utsava Samiti) కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

