Breaking | పూర్వ ఆర్డీవో అరెస్టు..

- ఫైళ్ల దహనం కేసులో సుప్రీం బెయిల్ రద్దు
(ఆంధ్రప్రభ, తిరుపతి క్రైమ్) : మదనపల్లె (Madnapalle) ఆర్డీవో కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో పూర్వ ఆర్డీవో (RDO) మురళిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుపతి (Tirupati) లోని మురళిని అతని ఇంటిలో అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేయడంతో మురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతేడాది జులై 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దస్త్రాల దహనం కేసులో మురళి నిందితుడు. కాగా ఇప్పటి వరకూ ఆయన సుప్రీంకోర్టు (SupremeCourt) ముందస్తు బెయిల్ పై బయట ఉన్నారు.
