ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లి బయలు దేరి వెళ్లారు. శుక్రవారం ఢిల్లిలో జరగనున్న పెట్టుబడి దారుల (ఇన్వెస్టర్స్‌) సమావేశంలో పాల్గొనేందుకు ఆయన హస్తిన బయలుదేరి వెళ్ళారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ పెట్టుబడులను పెట్టేందుకు గమ్యస్థానమని పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే ఔత్సాహక పారిశ్రామిక వేత్తలకు సింగిల్‌ విండో విధానంలో అనుమతులు ఇస్తన్నామని సీఎం చెప్పనున్నారు. ఢిల్లి పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు వివిధ అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది.

అలాగే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం పెద్దలతోనూ రేవంత్‌ రెడ్డి కలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రాజా రాజకీయ పరిస్థితులపై హైకమాండ్‌తో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల అంశంలో ముంచుకొస్తున్న కోర్టు విధించిన గడువు, బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ నిర్ణయంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే పార్టీ, నామినేటెడ్‌ పదవుల అంశంపై కూడా రేవంత్‌ చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Leave a Reply