- వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన
- పోలీసులు లాఠీ చార్జి.
- సీఐ, విద్యార్థికి గాయాలు
(ఆదోని , ఆంధ్రప్రభ) : కర్నూలు (Kurnool) జిల్లా, ఆదోని మండలం పరిధిలో ఆరేకల్ గ్రామ వద్ద నిర్మాణంలోని మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ గురువారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ ఆందోళన నిర్వహించారు.
నిర్మాణంలోని మెడికల్ కాలేజీ (MedicalCollege) వద్ద విద్యార్థులు ధర్నా చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.ఈ సందర్భంగా సాయి, సిఐ నల్లప్ప స్వల్పంగా గాయపడ్డారు.

