జేసీ సమక్షంలో ఖరారు

జేసీ సమక్షంలో ఖరారు

  • ఎక్సైజ్ శాఖకు రూ 5.15 కోట్ల ఆదాయం

కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో ఐదు బార్లకు లక్కీ చాన్స్(Lucky chance for bars) లభించింది. ఇంచార్జ్ కలెక్టర్ డాక్టర్ బీ. నవ్య(Navya) గురువారం లాటరీ నిర్వహించి లైసెన్సుదారులను ఖరారు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ దరఖాస్తుదారుల(of applicants)తో పాటు అసిస్టెంట్ కమిషనర్ హనుమం తరావు.. ఎక్సైజ్ సూపర్డెంట్ సుధీర్ బాబు(Sudhir Babu) ఏఇఎస్ రామ కృష్ణారెడ్డి, రాజశేఖర్ గౌడ్(Rajasekhar Goud), కర్నూలు ఎమ్మిగనూరు సీఐలు చంద్రహాస్, రాజేంద్ర ప్రసాద్, రమేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఆరోవంతు లైసెన్సు మొత్తాన్నిచెల్లించిన దరఖాస్తుదారులకు ప్రొవిజినల్ లైసెన్స్(Provisional Licence) మంజూరు చేశారు చట్టపర లాంఛనాలు పూర్తి కాగానే బారు ప్రదేశాన్నితనిఖీ చేసి(checked) శాశ్వత లైసెన్సులను మంజూరు చేస్తారు. కర్నూలు జిల్లాలో మొత్తం 26 బార్లకు నోటిఫికేషన్(and notified) ఇవ్వగా 24 బార్లకు దరఖాస్తులు చేరగా లాటరీ నిర్వహించి లైసెన్స్ ఖరారు చేశారు. ఈ దరఖాస్తులు నుంచి రూ.5.15 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం లభించింది.

Leave a Reply