మరోసారి వివాదంలో…

మరోసారి వివాదంలో…
వెబ్ డెస్క్, హైదరాబాద్ : సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రూపొందించిన ‘దహనం’ వెబ్ సిరీస్‌కు సంబంధించి హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ (Rayadurgam Police Station) లో వర్మపై కేసు నమోదైంది. ఈ కేసు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఫిర్యాదు మేరకు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే, ‘దహనం’ వెబ్ సిరీస్‌లో తన పేరును అనుమతి లేకుండా వాడుకున్నారని, సిరీస్‌లో చూపిన కొన్ని సన్నివేశాలు తానే చెప్పినట్లుగా వర్మ ప్రదర్శించడం పూర్తిగా అవాస్తవమని అంజనా సిన్హా (Anjana Sinha) ఆరోపించారు. ఈ చర్యతో తన వ్యక్తిగత గౌరవం దెబ్బతిందని పేర్కొంటూ, వెంటనే వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు (police) వర్మపై ఐదు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో తన సినిమాలు, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు ‘దహనం’ వెబ్ సిరీస్ కారణంగా మళ్లీ చట్టపరమైన సమస్యలను ఎదుర్కోబోతున్నట్లు తెలుస్తోంది.
