AP | మంత్రి లోకేష్‌తో కోకాకోలా ప్రతినిధులు భేటీ…
అమరావతి, ఆంధ్రప్రభ:రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రాన్రిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. బుధవారం ఉండవల్లి నివాసంలో హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ ప్రతినిధులు జువాన్ పాబ్లో ,రోడ్రిగ్జ్ ట్రోవాటో వారి బృందం సమావేశమైంది. ఈ భేటీపై నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో హెచ్‌సిసిబి పెట్టుబడులు పెడుతుందని తెలిపారు.రాష్ట్రం వ్యాపార అనుకూల వాతావరణం, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక కేంద్రంగా నిలుస్తుందని, దానికి నిదర్శనం కోకా కోలా పెట్టుబడులు” అని పేర్కొన్నారు.
వృద్ధి, ఉపాధి కల్పన, సమాజ అభివృద్ధికి ఆ కంపెనీ నిబద్ధతను తాము స్వాగతిస్తున్నామని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పురోగతికి దోహదపడే వ్యాపారాలకు తాము మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.