కర్నూలులో కార్డన్​ సెర్చ్​

అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు

4 బైకులు స్వాధీనం

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్​

( కర్నూలు బ్యూరో,  ఆంధ్రప్రభ)

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు శాంతిభద్రతల పై  కర్నూలు  పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.  అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లా గా తీర్చిదిదాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. ఈ సంధర్బంగా శనివారం కర్నూల్  డీఎస్పీ జె.బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో కర్నూల్ నాలుగో పట్టణ సిఐ  విక్రమసింహ, ఎస్సైలు మోహన్ కిషోర్ ,గోపీనాథ్ ,రామ మునయ్య , పోలీసు సిబ్బంది కలిసి కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజఫర్ నగర్ లో  కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్స్, అనుమానితులు, ట్రబుల్ మాంగర్స్,  సమస్యాత్మక వ్యక్తుల ఇళ్ళల్లో  తనిఖీలు నిర్వహించారు. వాహన పత్రాలు సరిగా లేని  4 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరూ చట్ట వ్యతిరేక కార్యక్రమాల జోలికి వెళ్ళకూడదని,  నేరాలు చేసే వారి గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని  పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply