ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతి(Vice President)గా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ (Delhi)లోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Draupadi Murmu) ఆయన చేత పదవీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా(Amit Shah), రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు మంత్రులు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్‌ఖడ్, వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (Justice B. Sudarshan Reddy)పై 152 ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు రాగా, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.

