మిర్యాల‌గూడ‌, ఆంధ్ర‌ప్ర‌భ : నాగార్జున సాగ‌ర్ (Nagarjuna Sagar) కు వ‌ర‌ద పోటు కొన‌సాగుతోంది. ఈ రోజు ఇన్‌ఫ్లో 1,66,586 క్యూసెక్కులు ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మై 14 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో (Inflow) ఎంత వ‌స్తుందో అంతే మొత్తం అవుట్‌ఫ్లో అవుతుంది.

స్పిల్‌వే (Spillway) ద్వారా 1,12,518 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మిగిలిన మొత్తాన్ని కుడి, ఎడమ కాలువలు, విద్యుత్‌ ఉత్పత్తి కోసం అధికారులు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం (Sagar full water level) 598.40 అడుగులు కాగా, ప్రస్తుతం 588.40 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది.

Leave a Reply