నంద్యాల ఏఎస్పీకి ఘన వీడ్కోలు

పదోన్నతి గౌరవం కాదు

మరింత కర్తవ్య బాధ్యత

తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డీఎన్​ కిషోర్​

( ఆంధ్రప్రభ, కాకినాడ )

ఏఆర్​ అడిషనల్ ఎస్పీగా పదోన్నతి- పొందిన  జిల్లా హోంగార్డ్ డీఎస్పీ కే. ఎస్. ఎస్. శ్రీనివాస్ ను  తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్  అభినందించారు. తూర్పు గోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా హోంగార్డ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న  కే. ఎస్. ఎస్. శ్రీనివాస్ ను అడిషనల్ ఎస్సీ(ఏ.ఆర్) గా పదోన్నతిపై నంద్యాల జిల్లాకు వెళుతున్న సందర్భంగా మర్యాదపూర్వకంగా వీడ్కోలు తెలిపారు.  ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… పోలీసు సేవలో కృషి, నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేస్తే పదోన్నతి సహజమని, బాధ్యతలు పెరిగిన కొద్దీ నిబద్ధత, సేవాభావం మరింత పెరుగుతాయని, పదోన్నతి కేవలం గౌరవం కాదు, అది మరింత కర్తవ్య బాధ్యతను గుర్తు చేసే అంశం అని తెలిపారు.

Leave a Reply