వినాయ‌క నిమ‌జ్జ‌నం వేళ‌…

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని బావు సింగ్ పల్లి గ్రామానికి చెందిన, ఇద్దరు భూపాలపల్లి(Bhupalpalli)లో టాటా ఏసీ, బైక్‌ను ఢీ కొట్టగా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

దీంతో ఆ కుటుంబాల(families)తోపాటు బావు సింగ్‌ప‌ల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బావు సింగ్ పల్లి(Bau Singh Pally) గ్రామానికి చెందిన కోడేపాక నరసయ్య, కోవల సంజీవ్(35) గ్రామపంచాయతీ సిబ్బంది (ట్రాక్టర్ డ్రైవర్) బావుసింసింగ్ పల్లిలో ఇద్దరు తమ అవసరాల నిమిత్తం, ఇందిరమ్మ గృహాలకు సిమెంటు కోసం, భూపాలపల్లికి ద్విచక్ర వాహనంపై వెళ్ళ‌గా గణేష్ చౌక్, భూపాలపల్లి(Bhupalpally) నుండి బాంబుల గడ్డ వైపు బైక్ మీద వెళ్తుండగా ఎదురుగా టాటా ఏసీ వాహనంను నడిపే వ్యక్తి అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి ఢీ కొట్టాడు.

దీంతో మోటార్ సైకిల్(motorcycle) పై వెళ్తున్నఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, వారిని వంద పడకల హాస్పిటల్ భూపాలపల్లికి తరలించారు. వినాయక నిమజ్జనం(Vinayaka immersion) వేళ రోడ్డు ప్రమాదం బారిన పడి మృతి చెందడంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. మృతులు నరసయ్యకు భార్య ఎల్లమ్మ, కుమారుడు నరేష్, మృతుడు సంజీవ్‌కు భార్య సంధ్య, ఇద్దరు కుమార్తెలు, అమ్ములు జానులున్నారు .

Leave a Reply