మ‌ద్యం రాయుళ్ళ‌తో ప‌రిచ‌యం..

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోవడం కంటే ఏదో ఒక పని చేసుకుని ఉపాధి పొందుతున్నవారి సంఖ్య అనేకం. కానీ.. కుషాయిగూడలో వీర స్వాములు (47) అనే వ్యక్తి ఏమీ పని లేదని డిఫెన్స్(Defense) మద్యం బాటిల్ల అమ్మకాలకు దిగాడు.

డిఫెన్స్ క్యాంటీ(canteen)న్లో మద్యం తీసుకునే వారితో పరిచయం ఏర్పరచుకొని వారి వద్ద మద్యం బాటిళ్ల(liquor bottles)ను తక్కువ ధరలకు కొనుగోలు చేసి నికాసైన డిఫెన్స్ మద్యం అంటూ అమ్మకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నాడు.

ఈ సమాచారం అందుకున్నమల్కాజిగిరి ఎక్సైజ్ ఏఈఎస్ ముకుంద రెడ్డి(excise AES Mukunda Reddy), సీఐ చంద్రశేఖర్, కుమారస్వామి, సంధ్యారాణి ఎస్ఐలు తోపాటు సిబ్బంది కలిసి త్రిశూల్ బార్ ఈసీఐఎల్ రోడ్లో వీరస్వామి ఇంట్లో బాటిళ్ళ‌ను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుకున్నటువంటి 50 మద్యం బాటిల్స్ విలువ‌ రూ. లక్షన్నరగా ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో నిందితుడు వీరస్వామి(Veeraswamy)తోపాటు అతడు వినియోగిస్తున్నబైకు(bike)ను, సెల్‌ఫోన్ల‌ను స్వాధీనం చేసుకొని మల్కాజిగిరి స్టేష‌న్‌కు తరలించారు. మద్యం పార్టీలను పట్టుకున్నఎక్సైజ్ సిబ్బందిని, ఎక్సైజ్ సూప‌రిటెండెంట్‌ నవీన్‌ల‌ను అభినందించారు.

Leave a Reply