నైజీరియాలో పడవ బోల్తా..

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: నైజీరియా (Nigeria)లోని బోర్గూ ప్రాంతంలో జరిగిన పడవ ప్రమాదంలో కనీసం 31 మంది దుర్మరణం పాలయ్యారు. పడవలో 90 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు సుమారు 50 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. ఈ తరహా ప్రమాదాలు ఆఫ్రికన్ దేశాల్లో సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దీనికి కారణం పాతబడిన పడవలు, అధిక లోడ్, భద్రతా నిబంధనలు పాటించకపోవడం. ఈ ప్రమాదంపై అధికారులు విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Leave a Reply