చేవెళ్ల, ఆంధ్రప్రభ : కారు (Car) అదుపుతప్పి వాగులో బోల్తాపడింది. ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన చేవెళ్ల (Chevella) మున్సిపల్ పరిధిలోని పామేన వార్డు వెళ్లే నక్షబాట పక్కన చోటుచేసుకుంది.


చేవెళ్ల మున్సిపల్ కేంద్రానికి చెందిన బిజెపి నేత (BJP leader) గుడుపల్లి నితీష్ రెడ్డి(27) రాత్రి కారు నడుపుతూ అటువైపు వెళ్ళాడు. కారు అదుపుతప్పి వాగులో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నితీష్ రెడ్డి (Nitish Reddy) అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా నితీష్ రెడ్డి అర్ధరాత్రి ఊరికి దూరంగా పామేన నక్షబాట వైపు ఎందుకు వెళ్లాడన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు (Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply